నీవు చదివి వినియున్న అనేకమైన ఇతర మంచి కధల్లాగే ఈ కధ కూడా ఎంతో మంచి కధ యైయుంది. అయితే నీవు మరింతగా చదివినట్లయితే ఈ కధ ఇతర కధల్లంటిది కాదని గ్రహించగలవు. మనం ఎవరైయున్నాం.మనం ఏం కాగలమో అనేవిషయాలను ఈ కధ మనకు తెలియజేస్తుంది.

దేవుడు

ఎల్లవేళల వున్నవాడు, ఉనికి కలిగివున్న దేవునితో ప్రారంభమైంది. ప్రస్తుతమున్నట్టే ఆయన ఎల్లప్పుడూ నిరంతరం వున్న వాడైయున్నాడు. ఈ సత్యం ఏమైనా గందరగోళంలా అనిపించినప్పటికీ ఆయనను గూర్చి వివరించబడినదానంతటికీ ఆయన మించియున్నాడు.

ఆదికాండం 1:1 కీర్తన 90:2

సృష్టి

సృష్టి ప్రారంభంలో దేవుడు సమస్తం కలుగునని పలికాడు. దేవుని ఆఙ్ఞతో నక్షత్ర మండలాలు గ్రహ రాశులు నక్షత్రాలు భూమితో సహా కలుగజేయబడ్డాయి. ఏదేను అని పిలువబడిన పరదైసు భూమిపై స్థాపించబడింది. తన సృష్టియంతటిలో దేవుడు పురుషుని స్త్రీని వున్నతస్థాయిలో వుంచాడు. దేవున్ని వ్యక్తపరిచే విధంగా దేవుడు వారిని తన పోలికలో తన స్వరూపమందు సృజించాడు. వారికి దేవుడు సమస్త సౌందర్యాన్ని దయచేసాడు. దేవునిచే ప్రేమించబడుతూ దేవున్ని ఆరాధిస్తూ ఆయనను సేవించాలనే దేవుని గొప్ప వుద్దేశ్యంతో వారు సృజించబడ్డారు. ఆయనయందలి సహవాసంలో వారు ఆనందించాలని దేవుడు వారిని సృజించాడు.

సమైక్యత

దేవుని రూపకల్పనలో సర్వసృష్టి, అందలి సమస్తం ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ సమీకృతంగా సమతుల్యంగా సమదృక్పధాన్ని కలిగి వుండేది. ఆ సమయంలో భూమిపై ఎలాంటి భాధ స్రమ వ్యాధి మరణాలు లేవు. దేవునికి మనిషికి మధ్య, స్త్రీ పురుషుల మధ్య అవగాహన సమాధానం సాన్నిహిత్యం ప్రేమ అంగీకారాలు సంపూర్ణంగా వుండేవి. సర్వ సృష్టి ఇదే విధంగా ఏకీభావంతో వుంది. అంతలో ఒక విషాదం సంభవించింది.

అవిధేయత

ఆదాము హవ్వ దేవునికి సమానులు కానప్పటికీ దేవుడు వారినెంతగానో ప్రేమించాడు. తాను సృజించిన సమస్తమంతటిపై వారిని అధికారులుగా చేసాడు. వారిని ఏదేనులో వుంచాడు. వారికి నిర్ణయాలు తీస్కొనే స్వేచ్చ స్వాతంత్ర్యం ఇవ్వబడ్డాయి. ఒక నియమంతో సృష్టిని పరిపాలిస్తూ వచ్చారు. ఒక చెట్టు ఫలాన్ని మాత్రం తినవద్దని ఆఙ్ఞాపించాడు. ఒక రోజున దేవుని శతృవు పడద్రోయబడిన సైతాను అను పేరుగల దూత పాము వేషం ధరించి తన అబధ్ధాలు వినిపించడానికి ఆదాము హవ్వల వద్దకు వచ్చాడు. తమ పట్ల దేవునికి మంచి వుద్దేశ్యం లేనట్టు దేవుడు తమ మేలును మంచిని కోరడంలేదన్నట్లు వారు ఆలోచించేల వారిని మోసగించాడు. ఫలితంగా వారు బుద్దిపూర్వకంగా అవిధేయులయ్యారు. అట్టి తిరుగుబాటుతో వారు ఆ పండు తిన్నారు. దేవుదు ఇక వారే మంచి చెడుల నిర్ణయాలు చేసేవారన్నట్టుగా తిరుగుబాటు ధోరణితో పండు తిన్నారు.

పర్యవసానం

ఒక వైరస్ వ్యాప్తి చెందే విధంగా ఆదాము హవ్వల హృదయంలో సర్వసృష్టిలో పాపం వ్యాప్తి చెందింది. తమ క్రియలకు వారు తగిన పర్యవసానాన్ని ఎదుర్కొన్నారు. తరం తరానికి పాపం, వ్యాధి సంక్రమించాయి. సర్వసృష్టి దేవుడు సృజించిన సహజ మహిమ స్తితినుండి పతనమైపోయింది. ఈనాడు మనం చదివి తెలుసుకొంటూవున్న యుద్దం, వ్యాధి, పేదరికం, దురాశ, దోపిడి యావత్తూ పాప పర్యవసానమే.

రోమా 3:10 రోమా 3:19

అక్కర

సృష్టి ప్రారంభంలో వునికిలో వున్నట్టి ప్రేమసంపూర్ణతలను గూర్చి ఆలోచించినట్లైతే మనం వూహించలేనంత నీచత్వానికి మానవాళి పతనమైనదని చెప్పాలి. మనలోని పగ మనం పలికే అబద్దాలు, బిగ్గరగా ప్రకతించడానికి పనికిరానట్టి అసహ్యమైన చెడు తలంపులు మొదలగువాటిని ఒక్కసారి యధార్ధంగా పరిసీలించుకొంటే మన హృదయపు వాస్తవం మనక్కనిపిస్తుంది.సమస్త ప్రజలు అందరం దోషులైయున్నాం. అందరు పాపం చేసి పాప పర్యవసానాన్ని పొందారు. భౌతిక మరణం కంటే కూడా ప్రేమగల దేవుని నుండి వేరుచేయబడిన స్థితి కడు దౌర్భాగ్యమైయుంది. ఇట్టి స్థితి కడు వేదనకరం. దేవుని నుండి వేరుపరచబడిన స్థితి శ్రమ దుఖాలతో కూదిన విచారకరమైన స్థితియైయుంది. ఈ కారణంగా మనం కొన్ని ప్రశ్నలు కలిగివున్నాం. దీనికేదైన పరిష్కారం వుండగలదా? ఏదైనా నిరీక్షణ వున్నదా?

వాగ్దానం చేయబదినది

తమ పాపానికి ఫలితంగా దేవుడు ఆదాము హవ్వలను ఏదేను వనం నుండి బయటికి త్రోసివేసినప్పటికీ భద్రత, నిరీక్షణలను వారికి వాగ్దానం చేసాడు. వారి వారసుడొకరు మానవాళిని విమోచిస్తాడనేది వారికివ్వబడిన వాగ్దానమైయుంది. ఆనేక శతాబ్దాల తదుపరి దేవుడు విమోచకునికి మార్గాన్ని సరాళం చేసాడు. అనేక శతాబ్దాలకు పూర్వమే చేయబడిన వాగ్దానముననుసరించి ఆయన జన్మం జీవితం మరణ వివరాలు బైబిల్లో ఆయనరాకకు ముందే ఇవ్వబడ్డాయి. యావత్ మానవ చరిత్రకే కేంద్రస్థానంగా మానవాళి రక్షకుదైన ఒకే ఒక్క వ్యక్తిపై గురిని నిల్పుతూ బైబిలు సందేశం కొనసాగింది. నశించినదానిని వెదకి రక్షించే ప్రయోజనం కొరకు విమోచకుది లోకానికి వచ్చాడు. లూకా 19:10; ఇంతకీ విమోచకుడెవరు?

వాగ్దానం నెరవేరింది

వాగ్దానం చేయబడిన రక్షకుడు వాస్తవంగా దేవుడే. దేవుడు మానవరూపం దాల్చి ఏసుక్రీస్తను పేరున 2000 సంవత్సరాల క్రిందట లోకానికి వచ్చి పాతనివంధన ప్రవచనాలన్నిటిని నెరవేర్చాడు. ఒక కన్యక తనకు తల్లి కావడంతో ఏసుజన్మ ఎంతో అద్భుతమైనదిగా వుంది. ఆయన జీవితం ఎంతో ప్రత్యేకమైనది. సాటిలేనిది ఆయన ఎటువంటి పాపం లేకుండా తండ్రియైన దేవునికి లోబడి తండ్రి సహవాసంలో ఆనందించాడు. ఇట్టి విధేయత పాపరహితమైన స్థితి వేదనకరమైన సిలువ మరణానికి నడిపించింది. తండ్రి సంకల్ప ప్రకారం ఏసు ఇష్టప్రకారంగా విధేయతతో సర్వ మానవాళి పాపం నిమిత్తం సిలువలో సమృద్ధియైన వెల చెల్లించాడు. ప్రపంచం ఎన్నడెరుగని విధంగా దేవుని కృప కనికరాలు ఎంతో ఆస్చర్యకరమైన విధానంలో ప్రత్యక్షపరచబడ్డాయి. ఆయన యందు విస్వాసముంచే వారందరికొరకు ఆయన మరణం ప్రత్యామ్నాయ బలియాగంగా సమర్పించబడింది. తమ పాపం మరియు సైతాను ద్వారా నశించి నిరీక్షణలేని స్థితిలో విడువబడిన మానవాళి కొరకు నిర్దోషియైన ఏసుక్రీస్తు మరణించాడు.

ఏసు మృతులలోనుండి లేపబడడం ద్వారా ఈ భూమిపై ఆయన పరిచర్య వుద్దేశ్యం నెరవేర్చబడి ఆయన ప్రారంభించిన వుద్యమం పూర్తి చేయబడింది. తన మరణం ద్వారా పాపాన్ని, తన పునరుథ్థానం ద్వారా మన్రణాన్ని నశింపచేయడానికి ఏసు సమాధినుండి లేపబడ్డాడు. దేవుడు వాగ్దానం చేసినట్టే నలుబది దినముల తరువాత సర్వాధికారి అయిన రాజుగా పరిపాలించడానికి పరలోకానికి వెళ్ళాడు.

అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు...

1 పేతురు 3:18 గలతీయులకు 1:4

అన్ని కొత్త విషయాలు

ఏసునందు మాత్రమే విస్వాసముంచినవారికి సమస్తమును నూతనమైనవిగా చేయబడతాయి సమస్తమును నూతనమైనవిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం నూతన భూమి నూతన ఆకాశములందు పాపం స్వార్ధం సమూలంగా తుడిచివేయబడతాయి. దేవునితో పరిపూర్ణ స్నేహం కలిగియుండే స్థలం నూతన భూమి నూతన ఆకాశములైయున్నాయి. దేవునితో ప్రతి ఒక్కరితో సృష్టియంతటితో ఎంతో సమైక్యత వృధ్ధి చెందుతుంది. భూకంపాలు, వినాశక సునామీలు ప్రళయ తుఫానులు భూమిని పాడు చేసే వ్యాధులు మొదలైనవేవీ లేనట్టి నూతన భూమ్యాకాశాలు కలిగి వుంటాం.

ఎటువంటి విచారాలు హృదయ వేదనలు భగ్న హృదయాలు వ్యాధి మరణం అనేవి మనలను బాధించవు. ప్రారంభంలో దేవుని సృష్టిని ఎలా రూపొందించాడో ఆ విధంగానే సమస్తం వుంటుంది. దేవుడు మొదట వుద్దేశించినరీతిగానే సృష్టియావత్తూ దేవుని పరిపూర్ణ గృహంగా మార్పుచెందుతుంది. దేవుని అనాది సంకల్పం నెరవేర్చబడుతుంది. దేవునియందు విశ్వాసముంచినవారు దేవుని గొప్ప రక్షణ ద్వారా ఆయనను ఆరాధించి సేవించి ప్రేమించుటయనే ఘనమైన స్తితికి శాశ్వతమైనట్టి యుగాలు దేవునితో ఆనందిస్తారు.

ప్రకటన 21:4

యుగయుగాలు దేవునితో

నూతన భూమ్యాకాశాల జీవితంలో మహత్తరమైన విషయమేమిటంటే దేవునితోడి శాశ్వతమైన జీవితం ఎన్నటెన్నటికీ దేవునితో జీవించడం అద్భుతమైనది. మనలను సృజించి ప్రేమించి మనకోసం మరణించినవానితో కలిసి జీవించే పరిపూర్ణ సంబంధానికి మనం పునరుధ్ధరించబడతాం. గొప్ప వేదపండితుడు పిల్లల పాఠ్యాంశాల రచయిత అయిన సి. యస్. లూయిస్ నూతన ప్రపంచంలో మనం అడుగుపెట్టే మొదటి దశను ఈ విధంగా పోల్చి వర్ణించాడు. భూమిపై ఎవ్వరూ చదవనిదీ ఎన్నటెన్నటికీ కొనసాగే ఒక గొప్ప కధయొక్క మొదటి అధ్యాయం వంటిదని ఈ గొప్ప వృత్తాంతం యొక్క ప్రతి అధ్యాయమూ ఒకదానికంటె ఒకటి శ్రేష్టమైనదని తెలియజేసాడు.

ముగింపు - ఈ కధనంలో నీ పాత్ర ఏమైయుంది?

సృష్టి నుండి పునరుధ్ధరణ వరకు దేవుడు ఆశ్చర్యకరమైన కధనాన్ని రచించాడు. ఆయనను ఆరాధించి ఆయనను సేవించి ఆయనతోడి సహవాసంలో ఆయనతో ఆనందించుటకు దేవునియొక్క ఈ కధలో నీవూ ఒక భాగమైయుండడానికి దేవుడు నిన్ను సృజించాడు. నీవూ దేవుని క్షమాపణను పొంది నీ జీవిత గురిని తెలుసుకొని నీ జీవిత నిర్మాణకుడు నీ సృష్టి కర్తను తెలుసుకొనడానికి నీవు సృజించబడ్డావు.

విశ్వాసం ద్వారానే రక్షణ

ఏసుక్రీస్తు అతి సామాన్యమైన రీతిలో నమ్ముకొనగలిగిన విశ్వాసమే నిన్ను రక్షించగలదైయుంది. ఏసునందలి విశ్వాసానికి ఫలితంగా పాప పర్యవసానం నుండి ఫలితం నుండి నీవు తప్పించుకోగలవు. తన మరణం ద్వారా నిన్ను కొనినట్టి ఏసుక్రీస్తుకు నీవు చెందియుంటావు. పాపబంధకాలనుండి తమ్మును విడిపించడానికి తన ఏకైక కుమారుని సమర్పించిన దేవునియందు గాక మరి ఏ ఇతర విషయాలపై విశ్వాసముంచినా అట్టివారెప్పటికీ ప్రేమగల దేవుని వేరుచేయబడి వుంటారు. వేదనకరమైనట్టి దేవునితోడి ఎడబాటు నరకం అని పిలువబడింది.

ఎఫెసీ 2:8–9

ప్రతిస్పందన

అనాదినుండి రానున్న తరాల వరకు దేవుడు వ్రాస్తూవున్న ఈ గొప్ప కధలో భాగస్తుడివి కావాలని దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ వున్నాడు. ఈ దినమే ఆయన నీకు రక్షణ ఇవ్వగోరుతూ వున్నాడు. దేవుడు నీకివ్వగోరే రక్షణకు నీ స్పందన ఏమైయుండగలదు. సామాన్యమైన రీతిలో దేవుని ఆహ్వనానికి నీవు ఈ క్రింది విధంగా స్పందించవచ్చు:

  • దేవునికొరకైన నీతి అవసరత గుర్తించుట
  • క్షమించమని ప్రభువును అడగాలి (ప్రార్ధించాలి)
  • నీ భద్రతకొరకై ఏసు ప్రభువును మాత్రమే విశ్వసించాలి
  • ఈ ఈదినం నుండి ప్రభువును నీ రాజుగా అంగీకరించి విశ్వాసంతో ఆయనను వెంబడించుట

నీవు ఏసునందు విశ్వాసముంచిన మరుక్షణం నుండి నీవు ఆయన కుమారుడవు/ కుమార్తెవై యుంటావు. దేవుని ఆత్మ నీలో నివసిస్తాడు. దేవుని కధలో భాగస్తులైయుంటారు. ఆయన యందకి సహవాసంలో నీవు ఎదిగే కొద్దీ దేవుని కధను గూర్చి నీవు మరింతగా అర్ధం చేసుకోగలవు. నీ జీవితంలోను చూడగలవు. నీ గత, ప్రస్తుత భవిష్యత్తు పాపం యావత్తూ క్షమించబడింది. దేవునిచే సంపూర్ణంగా అంగీకరించబడ్డావు. దేవునితో ఇట్టీ సంబంధాన్ని నీవు ప్రారంభించినపుడు నీ పరిస్థితులన్నిటిలో నీ జీవిత ఒడుదుడుకులన్నిటిలో నీ సంతోషంలో విచారాలలో సదాకాలమూ నీతో వుంటానని ఆయన వాగ్దానం చేస్తూవున్నాడు. శాశ్వతమైనట్టి మార్పులేని తన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూవున్నాడు. నిత్యజీవం మాత్రమే కాదు జీవితగురిని చూపించి జీవితాన్ని సాఫల్యం చేసే ఈ జీవితకాలం మట్టుకు స్వేచ్చా సంతోషాలను అనుగ్రహిస్తాడు.

యోహాను సువార్త 6:47

TheStoryFilm.com