నీవు చదివి వినియున్న అనేకమైన ఇతర మంచి కధల్లాగే ఈ కధ కూడా ఎంతో మంచి కధయైయుంది. అయితే నీవు మరింతగా చదివినట్లయితే ఈ కధ ఇతర కధల్లంటిది కాదని గ్రహించగలవు. మనం ఎవరైయున్నాం. మనం ఏం కాగలమో అనే విషయాలను ఈ కధ మనకు తెలియజేస్తుంది.
వృత్తాంతం ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్న దేవునితో ఆరంభం అవుతుంది. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఉన్నట్లుగానే ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉన్నాడు. ఇది గందరగోళంగా కనిపించినట్లైతే, దానికి కారణం ఒకరు సంపూర్ణంగా గ్రహించగలిగిన దానికంటే అది మించినదిగా ఉంది.
ఆరంభంలో, దేవుడు పలికాడు, సమస్తమూ ఉనికిలోకి వచ్చింది. ఆయన ఆజ్ఞ చేత, సమస్త విశ్వం సృష్టించబడింది. పాలపుంతలు, నక్షత్రాలు, భూమితో సహా గ్రహాల ఆశ్చర్యకర ప్రకటనతో నిండిపోయాయి. దాని మీద ఏదేను అను పరదైసు తోట ఉంది. ఆయన సృష్టించిన అందాలన్నిటిలో, శ్రేష్టమైన ఆయన చేతిపని పురుషుడు, స్త్రీ. దేవుడు తనను ప్రతిబింబించడానికి తన స్వరూపంలో ఆదాము, హవ్వలను సృష్టించాడు. ఆయనను ప్రేమించడం, ఆయనను సేవించడం, ఆయనతో సంబంధాన్ని ఆనందించడం చేత ఆయనను ఆరాధించడం అనే గొప్ప ఉద్దేశ్యంతో వారు సృష్టించబడ్డారు.
దేవుని ఉద్దేశం ప్రకారం, సృష్టి అంతా సామరస్యంగానూ, అది ఏవిధంగా ఉండాలో ఖచ్చితంగా అదే విధంగా ఉంది. ఈ సమయంలో బాధ, శ్రమ, అనారోగ్యం లేదా మరణం అక్కడ లేవు. దేవునికీ, మనిషికీ మధ్య, ఆదాము, హవ్వలకూ మధ్య, సృష్టి అంతటా సంపూర్ణ ప్రేమ, అంగీకారం, సాన్నిహిత్యం ఉంది. అయితే విషాదకరమైనది సంభవించింది...
ఆదాము హవ్వలు దేవునికి సమానులుగా ఉండడంలో చాలా దూరంగా ఉన్నారు, అయినా, ఆయన ప్రేమతో వారిని ఏదెనులో తాను కలిగి యున్న, తాను సృష్టించిన ప్రతిదానిపైనా బాధ్యులుగా చేశాడు. వారు నిర్ణయాలు చెయ్యడానికీ, ఒక నియమంతో భూమిని పాలించడానికీ వారికి ఆయన స్వేచ్చను ఇచ్చాడు. ఒక నిర్దిష్ట చెట్టు ఫలాలను తినకూడదు. ఒక రోజు, దేవుని శత్రువు, పతనమైన దేవదూత సాతాను, దేవుణ్ణి ఓడించాలని కోరుకున్నాడు, కాబట్టి వాడు ఒక సర్పము రూపాన్ని ధరించాడు, ఆదాము హవ్వలకు అబద్ధం చెప్పాడు. దేవుడు మంచివాడు కాడు, వారి క్షేమాన్ని మనసులో ఉంచుకోలేదని దేవుని విషయుంలో అతడు వారిని మోసం చేశాడు. ఫలితంగా, వారు బుద్ధిపూర్వకముగా దేవునికి అవిధేయత చూపారు. తిరుగుబాటులో, ఆదాము హవ్వలు ఆ ఫలాన్ని తిన్నారు, దేవుడు కాకుండా, తామే సరైనదానినీ, తప్పునూ నిర్దారిస్తారని నిర్ణయించుకున్నారు.
వారి చర్యల పరిణామాలు వినాశకరమైనవిగా ఉన్నాయి! ఒక విషక్రిమి వలె, పాపం సృష్టి అంతటిలోనికీ, ఆదాము హవ్వల హృదయాలలోనికీ ప్రవేశించింది. పాపం, శ్రమ, బాధ తరం నుండి తరానికి సంక్రమించాయి; సృష్టి అంతా దాని ఆదిమ నిర్మాణం నుండి వక్రీకరించబడింది. నేడు మన ప్రపంచాన్ని పీడిస్తున్న యుద్ధం, పేదరికం, వ్యాధి, దురాశ, కుంభకోణాల వృత్తాంతాలను మనమందరం చదివాము లేదా విన్నాము. అవన్నీ పాపం యొక్క ఫలితమే.
సృష్టి ఆరంభంలో ఉన్న పరిపూర్ణత, ప్రేమల గురించి మనం ఆలోచించినప్పుడు, "మనం ఊహించలేనంత మనం ఊహించలేనంత లోపాలతోనూ, పాపాలతోనూ నిండి ఉన్నాము” అని మనం తెలుసుకొంటాము. మనం కలిగి ఉన్న పగలు, మనం చెప్పిన అబద్ధాలు, మనం ఎప్పుడూ బహిరంగంగా చెప్పడానికి ధైర్యం చేయని తలంపుల గురించి ఆలోచించండి. మన స్వీయ హృదయాలను యదార్ధంగా పరిశీలించినట్లయితే వాస్తవం బయలుపడుతుంది. మనమందరం దోషులం. ప్రతి ఒక్కరూ పాపం చేసారు, అంతిమ పరిణామం, భౌతిక మరణం కంటే మిక్కిలి చెడ్డదిగా ఉంటుంది. ఇది ప్రేమగల దేవుని నుండి శాశ్వత యెడబాటు, భయంకరమైన దుఃఖం, దౌర్భాగ్యముతో కూడి ఉంటుంది. దీనంతటి కారణంగా, మనం ఈ ప్రశ్నలను గురించి ఆలోచించాలి: ఏదైనా జరుగగలదా? ఏదైనా నిరీక్షణ ఉందా?
వారి పాపం ఫలితంగా దేవుడు ఆదాము హవ్వలను ఏదెను నుండి తొలగించాడు, అయితే వారికి రక్షణ, నిరీక్షణల వాగ్దానాన్ని వారికి అనుగ్రహించాడు. వారి సంతానంలో ఒకరు ఒకానొక రోజు మానవాళిని పాపం నుండి రక్షిస్తాడని ఆయన వారికి వాగ్దానం చేశాడు. తరువాతి శతాబ్దాలలో, లోక రక్షకునిగా మారే ఈయనకు దేవుడు మార్గం సిద్ధం చేశాడు. ఆయన జననం, జీవితం, మరణముల గురించిన ఖచ్చితమైన వివరణలు ఆయన రాకకు అనేక శతాబ్దాల ముందు బైబిలు నమోదు చేయబడ్డాయి. వాస్తవానికి, పూర్తి బైబిల్ అంతిమంగా ఈ ఒక్క వ్యక్తిని సమస్త మానవ చరిత్రకు కేంద్ర బిందువుగా సూచిస్తుంది. ఆయన రాకడలో ఉద్దేశ్యము "నశించిన దానిని వెదకి రక్షించుటయే" (లూకా 19:10). మరి ఆయన ఎవరు?
వాగ్దానం చేయబడిన రక్షకుడు దేవుడై ఉన్నాడు. సుమారు 2,000 సంవత్సరాల క్రితం దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిగా మానవుడయ్యాడు, పాత నిబంధనలో ముందుగా చెప్పబడిన వాటన్నిటినీ ఆయన నెరవేర్చాడు. ప్రభువైన యేసు తల్లి కన్యక కనుక ఆయన జననం ఆశ్చర్యం. ఆయన జీవితం అద్వితీయమైనది: ఆయన పాపం లేకుండా పరిపూర్ణంగా ఆనందించాడు, దేవునికి విధేయత చూపాడు. ఇది అంతిమంగా ఆయనను సిలువపై వేదనపూరితమైన మరణానికి దారితీసింది, ఆయన దేవుని ప్రణాళిక ప్రకారం, మానవాళి పాపాల కోసం పరిహారం చెల్లించడానికి ఇష్టపూర్వకంగా, విధేయతతో, చాలినంత బలియాగమై మరణించాడు. లోకం ఇంతకు ముందెన్నడూ యెరుగని అత్యంత గొప్ప దయ, కృపల ప్రత్యక్షతలో ప్రభువైన యేసు జీవితం, ఆయన మరణం ఆయనను విశ్వసించే వారందరి కోసం ప్రత్యామ్నాయంగా మారాయి. పాపం, సాతాను నుండి నిరీక్షణ లేని దోషులను రక్షించడానికి పరిపూర్ణంగా నిర్దోషియైనవాడు మరణించారు.
అయితే సమాధి ప్రభువైన యేసును పట్టి ఉంచలేకపోయింది. మూడు రోజుల తరువాత, ప్రభువైన యేసు తన సమాధి నుండి వెలుపలికి వచ్చాడు, సిలువపై మరణించడం ద్వారా పాపాన్ని ఓడించడం, మృతులలో నుండి లేవడం ద్వారా మరణాన్ని ఓడించడం అని లోకంలో తన లక్ష్యాన్ని నెరవేర్చాడు - దేవుడు వాగ్దానం చేసినట్లుగానే. నలభై రోజుల తరువాత ఆయన పరలోకానికి ఆరోహణుడయ్యాడు, అక్కడ ఆయన నీతి రాజుగా ఏలుబడిచేస్తాడు.
కానీ కథ అక్కడితో ముగియలేదు...
ప్రభువైన యేసును మాత్రమే విశ్వసించే వారందరికీ, సమస్తామును నూతనంగా చేస్తానని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. నూతన ఆకాశం, నూతన భూమి పాపం, స్వార్థం లేకుండా ఉంటాయి. దేవునితోనూ, ఇతరులతోనూ, సమస్త సృష్టితోనూ పరిపూర్ణ స్నేహం ఉన్న ప్రదేశం. విధ్వంసకరమైన భూకంపాలు, వినాశకరమైన సునామీలు లేదా హింసాత్మక తుఫానులు భూమిని ఇకపై పీడించవు. మనలను ఇబ్బంది పెట్టడానికి ఇకమీదట బాధ, పగిలిన హృదయాలు, అనారోగ్యం లేదా మరణం ఉండవు.
ప్రతిదీ అది ఏవిధంగా ఉండాలో అదేవిధంగా ఉండేలా పునరుద్ధరించబడుతుంది. నూతన భూమి తరిగి దేవుడు తన సృష్టి కోసం ఉద్దేశించిన పరిపూర్ణ గృహంగా మారుతుంది. దేవుని ఆరంభ ఉద్దేశ్యం వర్ధిల్లుతుంది, ఆయన రక్షణపై విశ్వసించిన వారు ఆయనను ప్రేమించడం, ఆయనను సేవించడం, నిత్యమూ ఆయనతో సంబంధాన్ని ఆస్వాదించడం ద్వారా ఆయనను ఆరాధించడం అనే గొప్ప ఉద్దేశ్యంలోనికి ప్రవేశిస్తారు.
ఈ నూతన లోకంలో అత్యంత అద్భుతమైన భాగం మనం దేవునితో నిరంతరమూ ఉంటాము, సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తాము. మనలను సృష్టించిన సృష్టికర్త, మనలను ప్రేమించి మనకోసం మరణించిన వానితో పరిపూర్ణ సంబంధానికి మనం పునరుద్ధరించబడతాము. వేదాంత పండితుడు, బాలల రచయిత సి.ఎస్. లూయిస్ ఈ నూతన లోకంలోనికి మొదటి అడుగును "భూమిపై ఎవరూ చదవని గొప్ప వృత్తాంతంలోని మొదటి అధ్యాయం: ఇది నిరంతరం కొనసాగుతుంది: దీనిలో ప్రతి అధ్యాయం మునుపటి దానికంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది" అని పోల్చిచెప్పాడు.
సృష్టి నుండి పునరుద్ధరణ వరకు దేవుడు ఒక అద్భుతమైన కథను వ్రాస్తున్నాడు. ఆయనను ఆరాధించడానికీ, సేవించడానికీ, ఆయనతో సంబంధాన్ని ఆస్వాదించడానికీ ఆ కథలో భాగం కావడానికి ఆయన నిన్ను సృష్టించాడు. దేవుని కథలో ఆయనను చేరడం ద్వారా, మీ జీవిత కర్తను తెలుసుకోడానికి వచ్చినప్పుడు నీవు క్షమాపణనూ, అర్థాన్నీ, సంతృప్తినీ పొందుతావు.
విశ్వాసం అంటే నిన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే నమ్మకం ఉంచడం. అంటే పాప పరిణామాల నుండి నిన్ను నీవు రక్షించుకోగలవని నమ్మడానికి బదులుగా, ఆయన తన మరణం ద్వారా నీ కోసం కొనుగోలు చేసిన రక్షణ మీదకు నీ నమ్మకాన్ని బదిలీ చేయడం. నీ ప్రభుభక్తి ఇప్పుడు రాజైన ప్రభువైన యేసుపై ఉంది. ప్రభువైన యేసులో కాకుండా మరి దేనిలోనైనా నమ్మకం ఉంచేవారు, పాపపు బానిసత్వం నుండి మనలను విడిపించడానికి తన ఏకైక కుమారుడిని ఇచ్చిన ప్రేమగల దేవుని నుండి శాశ్వతంగా యెడబాటు చేయబడతారు. ఈ బాధాకరమైన యెడబాటును నరకం అంటారు.
రాబోయే యుగాలలో తాను వ్రాస్తున్న కథలో భాగం కావాలని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఈ రోజు మీకు రక్షణను అందిస్తున్నాడు, ఇది దేవుడు అందించే రక్షణకు మీ ఆహ్వానం. మీరు దేవుని రక్షణను ఇలా స్వీకరించవచ్చు:
మీరు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన క్షణం నుండి, మీరు దేవుని బిడ్డ అవుతారు, ఆయన ఆత్మ మీలో నివసించడం ఆరంభిస్తాడు. మీరు ఆయన కథలో భాగమయ్యారు. దేవునితో మీ సంబంధంలో మీరు ఎంతగా ఎక్కువగా ఎదిగితే, మీరు ఆయన కథను మీ జీవితంలో చూడటం, అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ గత పాపం, భవిష్యత్తు పాపం అంతా క్షమించబడతుంది. ఇప్పుడు మీరు ఆయన యెదుట సంపూర్ణ అంగీకారాన్ని పొందుతారు. మీరు ఈ సంబంధాన్ని ప్రారంభించినప్పుడు, మీకున్న అన్ని ఒడిదుడుకులలోనూ, ఈ జీవితంలోని ఆనందాలు, కష్టాలలో మీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. శాశ్వతమైన, మార్పులేని ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వత జీవాన్ని వాగ్దానం చేయడమే కాకుండా, ఈ జీవితంలో మీరు ఉద్దేశ్యం, నెరవేర్పు, స్వేచ్ఛను కూడా అనుభవించగలిగేలా ఆయన వచ్చాడు.
రాబోయే యుగాలలో తాను వ్రాస్తున్న కథలో భాగం కావాలని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు ఈ రోజు మీకు రక్షణను అందిస్తున్నాడు, ఇది దేవుడు అందించే రక్షణకు మీ ఆహ్వానం. మీరు దేవుని రక్షణను ఇలా స్వీకరించవచ్చు:
మీరు ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన క్షణం నుండి, మీరు దేవుని బిడ్డ అవుతారు, ఆయన ఆత్మ మీలో నివసించడం ఆరంభిస్తాడు. మీరు ఆయన కథలో భాగమయ్యారు. దేవునితో మీ సంబంధంలో మీరు ఎంతగా ఎక్కువగా ఎదిగితే, మీరు ఆయన కథను మీ జీవితంలో చూడటం, అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ గత పాపం, భవిష్యత్తు పాపం అంతా క్షమించబడతుంది. ఇప్పుడు మీరు ఆయన యెదుట సంపూర్ణ అంగీకారాన్ని పొందుతారు. మీరు ఈ సంబంధాన్ని ప్రారంభించినప్పుడు, మీకున్న అన్ని ఒడిదుడుకులలోనూ, ఈ జీవితంలోని ఆనందాలు, కష్టాలలో మీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. శాశ్వతమైన, మార్పులేని ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వత జీవాన్ని వాగ్దానం చేయడమే కాకుండా, ఈ జీవితంలో మీరు ఉద్దేశ్యం, నెరవేర్పు, స్వేచ్ఛను కూడా అనుభవించగలిగేలా ఆయన వచ్చాడు.